పేజీలు

7, జులై 2014, సోమవారం

Think about the following

తెలంగాణా అమర వీరులకు మా ఈ బ్లాగ్ అంకితం ...... 


 తెలంగాణ సిద్ధాంత కర్త
        ప్రొ. జయ శంకర్       



బంగారు తెలంగాణ నిర్మాణ కర్త  
కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు 










అమర వీరుల త్యాగ ఫలం మన ఈ తెలంగాణ 
అమరులారా వృధా  కానివ్వం మీ త్యాగం .  


     న తెలంగాణ మన ఆలొచనలకు స్వాగతం.  ఈ  బ్లాగ్ లో మన అలోచనలను పంచుకుందాం . రాబోయే బంగారు తెలంగాణ కు  బాటలు వేద్దాం . మేధావులరా  రండి మీ సలహాలు సూచనలను  ఈ మెయిల్  అడ్రసుకు పంపండి వాటిని మీ పేరుతొ ఇందులో ప్రచురి స్తాం.

మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ప్రస్తుతం అందుబటులొఉన్న రాజకీయ వ్యవస్థ , పాలనా యంత్రాంగం, ఆర్ధిక విధానాలు,  పరిష్కారాన్ని చూపించలెక పోతే ......  నూతన ఆలోచనలు, నూతన సంకేతిక ఆవిష్కరణలు మాత్రమే సమాధానం అవుతాయి. కాబట్టి బుద్ధి జీవులారా పెట్టండి మీ మెదడుకు పదును, కనిపెట్టండి సమస్యలకు పరిష్కారాలు. 

suvarna.telangana@gmail.com

*********************************************************************************
*********************************************************************************
 


************************************************************************  
రేషన్ కార్డు : రేషన్ కార్డు విషయంలో ఇదివరకే అనేక ప్రయోగాలూ, చర్చలు జరిగాయి.  అయినా వాటిని క్రమబద్దీకరించడంలొ అన్ని ప్రభుత్వాలు దాదాపు విఫలమయ్యాయి అని చెప్పడం కంటే పూర్తిగా సఫలం కాలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పటిదాకా వచ్చిన ప్రభుత్వాల చిత్తశుద్ధిని శంకించండం కంటే, వాటిని విమర్శించడం కంటే కూడా ఒక అర్ధవంతమైన చర్చ కు  తెరలేపడం మంచిది. ఆధార్  కార్డుల ప్రయోగం ముఖ్యంగా మన తెలంగాణలో చాలవరకు విజయం సాధించింది.  అధార్ కార్డుల విషయంలో కొంత వివాదం ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో అంతకు మించిన మార్గం మరొకటి లేదు. పైగా ఇప్పటికే వందల  కోట్లు ఖర్చ య్యాయి , కోట్ల మంది ఇప్పటికే ఆధార్ కార్డులను పొంది ఉన్నారు కూడా,  కాబట్టి ఈ రెండింటిని కలిపితే  అనుకున్న ఫలితాలను సాధించ వచ్చేమో?  ఈ దిశగా ఆలోచిస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి  అవి.
 1.   రేషన్ కార్డులోని సభ్యులందరి అధర్ కార్డునంబరును అనివార్యంగా నమోదు చేయాలి. 

2.  ప్రతీ రేషన్ కార్డుకు బార్ కోడ్ ఎలాగు ఉంది కాబట్టి, బార్ కోడ్ రీడర్ల ను విరివిగా 
 ఉపయోగిస్తే  చాలవరకు నకిలీ రేషన్ కార్డులను ఏరి పారవేయవచ్చు. 
 3.  ప్రభుత్వం కల్పించె అన్ని సౌకార్యాలకు రేషన్ కార్డును తప్పని సరి చేయాలి. 

4. నిర్ణిత పరిమితి దాటిన విత్త లావాదేవీలకు ఈ రేషన్ కార్డును అనుసంధానించాలి.  

5. వివాహాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేస్తూ ఆ జంటకు వివాహ ధ్రువీకరణ పత్రం తో పాటు కొత్త రేషన్ కార్డును మంజూరు చేయాలి.  ఆయా   పాత రేషన్ కార్డులలో వారి పేర్లను తొలగించాలి. 

6. జనన మరణాల నమోదుకు  రేషన్ కార్డు ఉపయోగం తప్పనిసరి చేయాలి. 

7. కుటుంబంలోని ప్రతీ సభ్యుడికి ఒకే నంబర్ తో రేషన్ కార్డును అందజేయాలి 

8. పాఠశాల లో చేరే సమయం నుండి ప్రతి చిన్న, పెద్ద కార్యక్రమాలకు/ అవసరాలకు  రేషన్ కార్డు వినియోగించాలి. 

ఫెడరల్ స్ఫూర్తికి , లోకల్ , నాన్ లోకల్ నిర్ణయించడానికి  ఇలా అనేక విషయాలలో రేషన్ కార్డులు సహాయ పడగలవు .  అధార్ నంబరు జాతీయ పౌరసత్వానికి, రేషన్ కార్డు నంబర్ రాష్ట్ర సభ్యత్వానికి  గుర్తింపులు అవుతాయి. కార్డు పై ముద్రించి ఉన్న వివరాల కంటే కూడా  సంబంధిత వెబ్ -సైట్ లలో ఉండే సమాచారాన్నే ప్రామాణికత ఉండేలా చూడాలి

అడ్రస్ మార్పు నకు  ఫూర్తి అవకాశం  కార్డు దారునికే ఇస్తూ ఆమోదించు అధికారం మాత్రం తహసిల్దార్ కు మాత్రమే ఉండేలా చూడాలి. 

పై న చెప్పిన సూచనల అమలు చేయడం  ద్వారా  మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు పూర్తి న్యాయం చేసే అవకాశం ఉందని మా అభిప్రాయం మాత్రమే. 
*******************************************************************************************************************
బ్యాటారి  తో నడిచే వాహనాలను ప్రోత్సహించడం ద్వారా కాలుష్యాన్ని నివా రించడమే కాకా పెట్రోల్ / డిసిల్ వినియోగాన్ని తగ్గించవచ్చు. వాటి పై ఉన్న సుంకాన్ని రద్దుచేస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం వల్లనే ఇది సాద్యం అవుతుంది . 


*******************************************************************************************************************
                 సోలార్ ద్వార విద్యుత్ ఉత్పత్తి చేయుటకు కావలసినవి ఎండ తీవ్రత , స్థ లం, సబ్  స్టేషన్ , తగిన సిబ్బంది.

మొదట ఎండ తీవ్రత :  నిజామాబాద్  జిల్లా లో రాష్ట్రము విడిపోకముందు వివరాల ప్రకారం 2వ స్థా నం  లో ఉంది .

రెండొవది స్థ లం  :   మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ మరియు నిజాం సాగర్ ప్రాజెక్ట్ లను తీసుకుంటే వాటికీ కేటాయించిన  స్థ లం చాల అనగా (     ) ఎకరాల్లో ఉంది. అట్టి స్థలాన్ని పూర్తి వినియోగం చేయటం లేదు .

మూడవది  సబ్ స్టేషన్  :   పైన తెలిపిన 2 ప్రాజెక్ట్ లు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కావున వాటికీ అనువైన
పరికరాలు అందుబాటులో ఉంటాయి.

ఇక నల్గోవది  తగిన సిబ్బంది  :  ఈ ప్రాజెక్ట్ లు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కావున దానికి సంబందిచి పూర్తి సిబ్బంది ఎలాగు ఉన్నారు వారికీ సొలర్  విద్యుత్ ఉత్పత్తి శిక్షణ ఇప్పించడం ద్వార వారిని వినియోగించుకోవచ్చు.

Solar Energy – Telangana
Of all the states in India, the newly formed state Telangana has some unique features.  It is located in high altitude called Deccan Plateau. More than 60% catchment areas of Krishna and Godavari rivers are in this region.  More than 40% area under forest of erstwhile undivided Andhra Pradesh was situated in Telangana. Geographically a healthy  and beautiful place to live in.  But unfortunately throughout its history the people of Telangana lived in adverse political, social and cultural conditions. After 60 years of peaceful struggele it is liberated from the clutches of Seemandhra biased administration.  During the last phase of Telangana freedom struggle the issue of Power crises emerged. Initially the issue was raised by the then Chief Minister Sri Nallari Kiramkumar Reddy. The intention to raise the issue at that point in time, it is alleged that to scare out the people of Telangana to be away from the movement. Yet the people of Telangana paid deaf ear to it and continued their agitation till they achieved it. In fact the power crises not just confined to Telangana only.  The National Capital, Delhi too witnessed severe power shortage recently. Therefore power shortage is neither new phenomenon nor it is confined to one state or region.
However, the problem of power shortage must be addressed as effectively as possible.  Because the consumption of power is increasing year by year in multiple dimensions.  Although the Telangana region has more than enough resources to produce electricity but due to many reasons it was not given proper attention. Let’s not be so retrospective. The need of the hour is to find out ways and means to come out of present power crisis and to meet future demand. We  try to explore the available options. However, at the outset the authors of this article intend to clear the following facts.  Firstly the authors are neither experts in this sector nor in any way connected to the power generation process. Therefore, this article must be read as an opinion only. Secondly the solutions suggested in this article must be construed as laymen suggestions, because they may not address deep technical issues.
          There must be two types of plans, namely:
a)   Short term Plan ( 1 year to 5 years)
b)   Long term Plan  ( 5 Years to 50 Years)
Short term Plan is necessary because we need to come out of present needs as soon as possible. Let us discuss the various sub options available under the category of Short term Plan little later.
Long term plan is also necessary to cater the needs of future demand.  The long term plan is also  necessary to ensure safe, secure, uninterrupted and quality power supply.  It must be ensured while envisaging long term plan that the power generated must be Eco friendly, not hazardous to environment and human health.
Now, let us try explore the sub options available in the first category- short term plan. Obviously “Solar Energy” occupies prominent place in this category. Second place may be given to “Wind driven power generation”. And finally “Bio Energy” too can play a major role in coming out present power shortage crisis.  To start with, extensive training programs must be initiated to young and enthusiastic people to install and maintain all the three power generation methods and to handle the devices involved in it.  Positively at the  expenses of the Government,  if possible with the help of Private Sector such as Solar Panel Producers. Secondly extensive survey for suitable places to install plants like Solar panels keeping in view the fall of sunlight for longer hours in a day and more number of days in a year with fullest intensity, as it necessary to extract maximum power from the installed solar panels. Similarly, for installations of  wind generated power devices, survey may be conducted as to ensure areas where maximum wind flow throughout the year. At this juncture it is must be cleared that in order to cut short the length of this article the authors intend to confine to  solar power generation only. THE FINAL GOAL OF THIS PROJECT IS TO SEE THAT EVERY HOUSEHOLD MUST PRODUCE AND USE AT LEAST 50% OF ITS  NEEDS FROM ITS OWN PRODUCED POWER

                   
AGENCIES INVOLVED IN PEOJECT: 

 1. Policy level (Ministry) to chalk out broad policies
 2. District Administration
 3. Solar panels manufacturing organizations
 4. Engineering colleges (for expertise advises ,for the students to be trained as      Master Trainers
 5.  Mandal Level Offices
   
 The Master Trainers are those people who train the Field Executives and
    Supervise the Installation Process.
                  
The Field Executors are actual real time technicians who install the plants

Phase I:      Identifying the Organizations which produce/distribute Solar Panels ready to extend cooperation in giving training to the people.
Phase II:     Searching for experts to prepare course content to give training to the people in the area of Solar Energy
Phase III:    Identifying the suitable candidates (Master trainers)  to undergo This training content must include practical, and field work too. Training schedule must be as short as possible without compromising over the quality of the training. Proper care should be taken that trainees represent from all regions/districts of the state.
                   Time Limit for all the three Phases:  1 Month;
                       No. of Trainers Expected: 50 to 100; if needed number can be more.
Phase IV:    Identifying the training Locations with fully equipped material for theory and practical.
hase V:       Identification of trainees.  They can be of two types. (1) Those who can start their own business (2)  Those who can work for others.
Phase VI:    Beginning of the Training. 
Phase VII:   This Phase should  begin with Phase I.  A different team should identify the  suitable  locations for installations of solar plants.  Immediately after the completion of training the trainees should start their work without wasting time. In this phase only finalization of locations will take place.
Ideal Places : Pochampad, Nizamsagar project locations are very much ideal for installation of solar power plants.  Because ample government land is available. Many Government buildings are also available which can be used to establish offices concerned.  The banks of canals can also be used to fix solar panels as it is done in Gujarat. Perhaps these plants may not require employees in bulk.  For instance Pochampad Hydraulic power generating plant will work for few months in a year.  For all other remaining months it stands idle.  Therefore those employees can well be used for the maintenance of the solar power plant too. 
 To know India's Solar Policy Click here
**************************************************************************************************************** గ్రామాలను కాపాడుకుంటూనే పట్టణీకరణ సాధ్యమేనా ? !

పట్టణీకరణం సాధరణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కనిపించే  ఒక అనివార్య దశ అని చాలామంది భావిస్తారు  .  అయితే ఇది  నాణానికి ఒక వైపు చిత్రం మాత్రమే. నిజంగా ఇది అనుకున్నంత పెద్ద సమస్య కాదు. 

గ్రామాలను అభివృద్ధి వైపా? లేక అభివృద్ధిని  గ్రామాల  వైపా ?  
Should Development  lead towards Village ? Or should Village lead Towards Development?


         పై రెండు ప్రశ్నలు ఒకటే కదా అనిపిస్తుంది.  కానీ సూక్షంగా చుస్తే చాలా తేడా కనిపిస్తుంది. ఉదాహరణకు ఒక ఏ అదిలాబాద్ జిల్లా  లోనో, నిజామాబాద్ లోనో  ఒక మారుమూల గ్రామాన్ని తీసుకుందాం.  ఆ గ్రామం జిల్లా రాజధానికి (హెడ్ క్వాటర్) 30 కిలోమీటర్ల దూరంలొ ఉందనుకుందాం.  ఆ గ్రామానికి కనీస  సౌకర్యాలు అంటే విద్యుత్తు, రోడ్డు  వంటివి కల్పించడం  పెద్ద సమస్య కాదు. కానీ ఒక కార్పొరేటు హాస్పటల్ ఒక డిగ్రీ కాలేజ్, పిజి కాలేజ్, లాంటివి   కల్పించండమంటేనే సమస్యలొస్తాయి. సాధారణంగా బతుకుతెరువు , ఉద్యొగం, పిల్లల చదువులు, వైద్య అవసరాలు గ్రామీణులను పట్టణాల  వైపు లాగుతున్నాయి. అన్ని రకాల అభివృద్ధి ఫలాలను ప్రతీ గ్రామానికి మోసుకెళ్ళడం కంటే కొన్ని గ్రామాలను అభివృద్ధి వైపుకు మళ్లించడం సులభం అనిపిస్తుంది.  అదెలాసాధ్యమో చూద్దాం.  

        ప్రతీ మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఆ మండలంలోని ప్రతి గ్రామం లోని ప్రతి  కుటుంబానికి మండల కేంద్రంలో (మండల హెడ్ క్వార్టర్లో) గృహ సౌకర్యం కల్పిస్తే  ప్రజలను గ్రామం తో తమకున్న అనుబంధాన్ని కొనసాగిస్తూనే వారి  కుటుంబాలను బస చేయించ వచ్చు. ఇప్పడు కడుతున్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రతి మండల హెడ్ క్వార్టర్ లలో అపార్ట్మెంట్ ల లాగా మల్టి స్టోరీ  గృహల  నిర్మాణం చేసి ఇవ్వవచ్చు.    అన్నిగ్రామాల ప్రజలకు మండలంలో చోటు కల్పించడంతొ మండలాల సైజు పెరిగి అవి మధ్య రకం పట్టణాలుగా రూపాంతరం చెందుతాయి. అప్పుడు గ్రామాలను కేవలం వ్యవసాయ కార్య కలాపాలకు మాత్రమే పరిమితంచేయవచ్చు. ఇక ఈ కాలంలో రవాణా సౌకర్యాల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.  ఇప్పటికే సగం కంటే అధిక జనాభాకు స్వంత వాహనాలు (కనీసం ద్విచక్ర వాహనాలు) ఉన్నాయి. అప్పుడు  మధ్య రకం నగరాలుగా మారుతున్న మండల హెడ్ క్వార్టర్లలొ అన్ని రకాల సివిక్ సౌకర్యాలతో పాటు అత్యాధునిక శాస్త్ర సాంకేతిక ఫలాలను అందరికి అందుబాటులో తేవచ్చు. 
         అందుకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలు ఇలా ఉండాలి. 
1.  ప్రతిమండలంలొ ప్రభుత్వ భూములను గుర్తీంచి వాటిలో పేదలకు ఉచిత లేక నామమాత్రపు ధరలకు గృహ వసతి కల్పించాలి. అవి అనివార్యంగా ఫ్లాట్ల (మల్టీ స్టోరీ బంగళాలలో ఒక రెండు  గదుల వసతి మాత్రమే కల్పించాలి.  కాస్త ఆర్ధిక స్తోమత ఉండి స్వంత, స్వతంత్ర (ఇండిఫెండెంట్) ఇల్లు కట్టుకోగలవారికి వంద గజాల స్థలం వరకు ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ చార్జీలలొ సగం కానీ అంతకెంటే వీలయితే ఇంకా తక్కువకు రిజిస్ట్రేషన్ చేసిచ్చే వీలు కల్పించాలి.  అంత కంటే ఎక్కువయితే  రిజిస్ట్రేషన్ చార్జిలను రెట్టింపు చెయాలి.  ఎందు కంటే  గృహ అవసరాలకోసం  భూమలవినియోగాన్ని తగ్గ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాక ఎకరాలకు ఎకరాలు, వేల గజాల జాగా కొద్ది మంది కబ్జాలో ఉండి అనవసరంగా భూముల ధరలను పెంచుతున్నారు. వారి బారి నుండి భూమిని విముక్తం చేసి దాన్ని అందరికి అందుబాటు లోకి తెవడానికి వివక్ష పూరిత రిజిస్త్రేషన్  చట్టం (Discriminating Registration Rules)  రూపొందించాల్సిన అవసరముంది.  ఇటువంటి చట్టాలు హైదరాబాద్ వంటి నగరాలకు సైతం వర్తించేలా చూడాలి. ఈ మొత్తం వ్యాసం ఉద్దేశాన్ని తక్కువ మాటల్లో ఇలా చెప్పుకోవచ్చు 
 " గ్రామాలను కేవలం వ్యవసాయానికి పరిమితం చేసి, గ్రామస్థుల కు పట్టణాల్లో నివాసానికి అనుకూల వాతావరణం  కల్పిస్తే ,  పట్టణాలను గ్రామాల పక్కనే అభివృద్ధి చేస్తే గ్రామాలను కాపాడుకుంటూనే పట్టణీకరణ సాధ్యమే !


 నూతన విద్యావిధానం 

        ముఖ్య మంత్రి  కే.సి. ఆర్ పదే పదే కేజి నుండి పీజీ వరకు ఉచిత విద్య గురంచి ప్రస్తావిస్తున్నారు. మంచి ఆలొచనే.  కాదనడానికి లేదు.  కానీ ఇందులో కొన్ని పాలనా పరమైన, ఆర్ధిక ఇంకా కొన్ని  సామాజిక  పరమైన అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. 

         మొదటగా  ప్లస్ 2 (ఇంటర్ మీడియట్ )  వరకు ఉచిత విద్య ఖచ్చితంగా కొనసాగాల్సిందే. ఆ తర్వాతే సమస్య. యూ. జి . సి. ఇటివల తీసుకొస్తున్న ప్రతిపాదనలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక విషయం   స్పష్టంగా  కనిపిస్తున్నది. యునివర్సిటి గ్రాంట్స్ కమీషన్, దాని అనుబంధ సంస్థ  NAAC, ప్రతిపాదిస్తున్న కార్యక్రమ సరళి బట్టి చూస్తె ఉన్నత విద్యాసంస్థలు అంటే అండర్      గ్రాడ్యుయేషన్, ఆపైన  కోర్సులకు  సంబంధించిన విద్యాసంస్థలు తమ మనుగడ కోసం అవసరమైన నిధులను తామే సమకూర్చుకోవల్సిన సమయం ఆసన్నమైనట్లుగా అనిపిస్తుంది.  ఒకవేళ యూ. జి.సి, లేక కేంద్ర ప్రభుత్వ విధానం కూడా అదే అయితే విద్యాసంస్థలు తమ మనుగడకోసం తప్పని సరిగా విద్యార్ధుల ఫీజుల పైనే అధారపడాల్సి వస్తుంది. అప్పుడు విద్యార్థులు తప్పనిసరిగా  తమ విద్యా సంస్థల భారాన్ని      కొంత మోయక తప్పదు. అందుకే ఈ వ్యాసం(విద్యార్థుల ) నినాదం " విద్య  సమాజం ఇచ్చే దానం కాదు - విద్య ప్రతి  విద్యార్థి  హక్కు"కావాలి.  అందుకోసం ఈ క్రింది విధానాన్ని అనుసరించాలి 

1.  డిగ్రీ విద్యార్థులకు పార్ట్ టైం ఉద్యోగాలు కల్పించాలి . 
2.  25 నుండి 40 శాతం వరకు ప్రైమరీ స్థాయి  ఉపాధ్యాయుల పోస్టులను 
     డిగ్రీ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలి. 
3.  వారికే శిక్షణ ఇచ్చి వారి సేవలను మాత్రమే ఉపయోగించుకోవాలి. 
4.  ఈ టీచర్  విద్యార్థులకు పిరియడ్ కు కొంత మొత్తాన్ని చెల్లించాలి. 
5. అందులోనుండే ఆ విద్యార్థి తన చదువు కు కావలసిన డబ్బులను 
    సంపాదించుకోవాలి  అంటే పోషణ, గృహవసతి భారాన్ని  తల్లిదండ్రులు

భరిస్తారు ఇక చదువుకు అవసరమైన ఖర్చులలో కొంత తన స్వంత సంపాదన పై ఆధార పడవచ్చు.